Manjummel Boys : మంజుమ్మల్ బాయ్స్ కాంట్రవర్సీ..ఏంటో తెలుసా..

Manjummel Boys : మంజుమ్మల్ బాయ్స్ కాంట్రవర్సీ..ఏంటో తెలుసా..

మలయాళ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys). సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజుల క్రితం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. గురువారం అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలను ఆపివేసింది. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి నిర్మాతల మండలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో షోలను ఆపివేయడం పై ఫైర్ అయ్యారు. మలయాళ నిర్మాత తో ఇబ్బంది ఉంటే తెలుగు వర్షన్ ఎలా ఆపుతారు అంటూ ప్రశ్నించారు. దీంతో పివిఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారాలపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశాన్ని ప్రారంభించింది.

డిజిటల్ ప్రొవైడర్లే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేసి సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లు గత కొంతకాలంగా క్యూబ్ కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో భారీగా వారు నష్టపోతున్నారట. థియేటర్లన్నీ డిజిటలైజ్ కావడంతో నిర్మాతలకు ఇది పెను భారంగా మారుతూ వస్తోందని.. డిజిటల్ ప్రొవైడర్లు దోపిడీ చేస్తున్నారంటూ నిర్మాతలు ఆరోపిస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది. స్పందించిన ఫిలిం ఛాంబర్‌ వారు వెంటనే పీవీఆర్ యాజమాన్యంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మంజుమ్మల్ బాయ్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన మొట్టమొదటి మలయాళ సినిమా. సర్వైవల్ థ్రిల్లర్‌గా ఫిబ్రవరి 22న కేరళలో రిలీజై దుమ్ములేపింది. ఏప్రిల్ 6న తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story