Telugu Movie : మీనాక్షికి బంపరాఫర్.. వెంకటేష్ తో లక్కీ ఛాన్స్

Telugu Movie : మీనాక్షికి బంపరాఫర్..  వెంకటేష్ తో లక్కీ ఛాన్స్

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి. ఆ తర్వాత ఖిలాడి, హిట్ 2 సినిమాల్లో ఈ అమ్మడు నటించింది. రీసెంట్ గా విడుదలైన గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు మరదలిగా నటించి

మెప్పించింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలోనూ ఈ బ్యూటీ చాన్స్ అందుకుంది.

ఈ భారీ ప్రాజెక్ట్ లో మీనాక్షి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే లేటెస్ట్ గా అమ్మడికి మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చింది. విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో ఓ సినిమా రాబోతుండగా..అందులో హీరోయిన్ గా త్రిష నటించనుందని వార్తలు వినిపించాయి. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశారట.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారట. వెచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మట్కా సినిమాలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో మీనాక్షి చౌదరి ఫుల్ బిజీగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story