Mega Hero : పేరు మార్చుకున్న మెగా హీరో

మెగా మేనల్లుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సాయి తేజ్ (Sai Dharam Tej) తన పేరు మార్చుకున్నారు. ఇక నుంచి తన పేరు 'సాయి దుర్గ తేజ్' అని ఓ ఈవెంట్లో తెలిపారు. 'సర్ నేమో మా నాన్న పేరు ఎలాగో ఉంటుంది. అమ్మ నాతో ఉండాలనే ఉద్దేశంతో నా పేరులో 'దుర్గ'ను జత చేసుకుంటున్నా' అని చెప్పారు. అమ్మ కూడా తనతో, తన పేరులో ఉండాలనే ఉద్దేశంతోనే పేరు సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నానని మెగా హీరో తెలిపాడు.
సాయి తేజ్, కలర్స్ స్వాతి కలిసి చేసిన 'సత్య' అనే మ్యూజిక్ వీడియోని మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ సందర్భంగానే సాయి తేజ్ తన పేరును మార్చుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఈ యంగ్ హీరో మొదట సాయి ధరమ్ తేజ్ గా ఉన్న పేరును 2019లో సాయి తేజ్ గా మార్చుకున్నారు. తాజాగా 2వ సారి పేరు మార్చుకోవడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com