Aashika Ranganath : ఆషికా రంగనాథ్‌కు మెగా ఆఫర్

సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటోంది కన్నడ నటి ఆషికా రంగనాథ్. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రంలో చిరుకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొంది. ఆషికా రంగనాథ్ ' అమిగోస్ ' సినిమా ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ ' చిత్రంలో మెరిసింది. మూడవ అవకాశాన్ని చిరంజీవి సరసన దక్కించుకుంది.
'విశ్వంభర' ఫాంటసీ కథతో తెరకెక్కుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి వీటికి
ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు దర్శకుడు వశిష్ఠ తెలిపారు. చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ పరంగా భారీగా ఉండబోతోంది ఈ మూవీ. ఈ మూవీలో చాలామంది హీరోయిన్స్ ఉండే చాన్సుంది. త్రిష, ఇషా చావ్లా, మీనాక్షిచౌదరి, ఆషికా రంగనాథ్ సహా మరికొంతమంది పేర్లు ఖరారయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com