Romance : మిక్సప్.. ఆహా అనిపించే రొమాన్స్

Romance : మిక్సప్.. ఆహా అనిపించే రొమాన్స్

ఓవర్ ది టాప్.. ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా బోల్డ్ గా ఉండడంతో ఫ్యామిలీలతో కలిసి డైరెక్ట్ ఓటీటీలో వస్తున్న సినిమాలు చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే అలాంటి బూతు బోల్ కంటెంట్‌కే ప్రాధాన్యతనిస్తు తెరకెక్కుతున్న సినిమాల ట్రెండ్‌న్ని ఓటీటీలు తెగ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఆహా ఓటీటీలోకి మిక్స్అప్ అనే సినిమా రానుంది. మార్చి 15 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆదర్శ, అక్షర గౌడ్, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ఇక ఇది పూర్తి అడల్ట్ కంటెంట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు నిమిషాల ట్రైలర్ మొత్తం బూతు, వోల్డ్ రొమాన్స్ అంశాలు అనే చూపించారు. రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు కపుల్స్.. రొమాన్స్ పట్ల వాళ్లకు ఉన్న అభిప్రాయాలు.. ఈ ట్రైలర్ లో చూపించారు. పెళ్లైన రెండు జంటలు వారి రిలేషన్షిప్ బోర్ కొట్టడం.. అవతలిజంట పట్ల అట్రాక్ట్ కావడం.. వాళతో ఎఫైర్ నడపడం ఈ సినిమాలో చూపించారు. ఒక జంటలో ఓ అమ్మాయి అక్షర గౌడ్ కి ఎప్పుడు రొమాన్స్ అంటే ఇంట్రెస్ట్. మరో జంటలో పూజ జవేరికి రోమాన్స్ అంటే ఆసక్తి ఉండదు. దీంతో వీళ్ళిద్దరూ వాళ్ళ భర్తలను మార్చుకుని రిలేషన్ మొదలు పెడతారు. ఇది బోల్డ్‌ కాదు చాలా బూతు కంటెంట్ అనే విధంగా సినిమా ఉంది.

ట్రైలర్ చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా బాలీవుడ్ లో దీపిక పదుకొనే గహర్యన్‌ సినిమాకు కాపీలా అనిపిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూత్‌ని టార్గెట్ చేసేలా ఇంటిమేట్ సన్నివేశాలు, డబల్ మీనింగ్ డైలాగులు ఈ సినిమాలో రూపొందించారు.

Tags

Read MoreRead Less
Next Story