Mokshagna : బజ్ క్రియేట్ చేస్తున్న మోక్షజ్ఞ

Mokshagna : బజ్ క్రియేట్ చేస్తున్న మోక్షజ్ఞ
X

మోక్షజ్ఞ ( Mokshagna ) ఎంట్రీ తో తన మొదటి సినిమా ప్రొడక్షన్ టైంలోనే పాజిటివ్ టాక్ దక్కించుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్ లో అవకాశాలను దక్కించుకుని.. స్టార్ హీరోగా మారే అవకాశం ఉంది. దీంతో మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉండబోతున్నాయి..? అభిమానుల అంచనాలను అందుకోగలుగుతాడా.. ? లేదా..? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఇప్పటివరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట వైరల్ అయ్యాయి. కానీ ఆయన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పటివరకు అభిమానులకు కూడా తెలియదు. అయితే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ మోక్షజ్ఞ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు.

మోక్షజ్ఞ మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే మోక్షజ్ఞకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల దగ్గర నటనకు సంబంధించిన శిక్షణ ఇప్పించారట బాలయ్య. ఇక మోక్షజ్ఞ తన అన్నలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దగ్గర కూడా కెరీర్ పరంగా కొన్ని సలహాలను తీసుకుంటే.. తప్పకుండా టైర్ వన్ స్టార్ హీరోల రేసులో అడుగు పెట్టగలడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Next Story