Multiplexes Offer : రూ.99కే మల్టీప్లెక్స్ సినిమా టికెట్

సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ నెల 31న సినిమా లవర్స్ డే సందర్భంగా కేవలం 99 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చని తెలిపింది. పీవీఆర్, ఐనాక్స్, మిరేజ్, ఏషియన్, సినీపోలిస్ లాంటి చైన్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 4 వేలకుపైగా స్క్రీన్లలో మే 31న ఇదే టికెట్ ధర అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే, ఆరోజు ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99కే చూడొచ్చన్నమాట.
వాస్తవానికి సాధారణ థియోటర్లలో టికెట్ ధర రూ.50 నుంచి రూ.200లోపు ఉంటే.. మల్టీప్లెక్స్‌లలో ఆ రేటు కాస్త ఎక్కువే. టాక్స్‌లన్నీ కలిపి రూ.250 నుంచి రూ.300 వరకూ ఉంటుంది. అంత ధర పెట్టి కుటుంబసమేతంగా సినిమా చూడలంటే సామాన్యులకు కష్టమే. ఆ రేట్లను చూసే వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారందరూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల టిక్కెట్ రేట్ల కంటే తక్కువ ధరతోనే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం దక్కింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com