Mrunal Thakur : బాలీవుడ్ మూవీలో మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : బాలీవుడ్ మూవీలో మృణాల్ ఠాకూర్
X

సీతారామం.. హాయ్ నాన్న సినిమాలతో ఫేమ్ అయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ). సీతా రామంలో తన అద్భుత నటనతో మృణాల్ అభిమానుల హృదయాలను దోచుకుంది. ఆమె ఇటీవలే ప్రభాస్ కల్కి 2898 ఏడీలో అతిథి పాత్రలో కనిపించింది. మృణాల్ బాలీవుడ్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2లో హీరోయిన్గా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. సన్ ఆఫ్ సర్దా ర్లో హీరోగా అజయ్ దేవగన్, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తున్నారు. వారు ఈ సీక్వెల్లో కూడా కనిపిస్తారు. అయితే సన్ ఆఫ్ సర్దార్ హీరోయిన్గా సోనాక్షి సిన్హా నటించిన సంగతి తెలిసిందే. కానీ సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటించ నున్నారు. ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి దర్శక త్వం వహించిన 'మర్యాద రామన్న'కు అధికారిక రీమేక్. ఒరిజినల్ సినిమాకు సీక్వెల్ లేనప్పటికీ, సన్ ఆఫ్ సర్దార్ నిర్మాతలు రెండో భాగం కోసం స్క్రిప్ట్ డెవలప్ చేశారు. మొదటి భాగం ముగిసిన చోట ప్రారంభం కాదు. పంజాబీ చిత్రనిర్మాత విజయ్ కుమార్ అరోరా సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్వరలో నే స్కాట్ లాండ్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

Tags

Next Story