Mrunal Thakur : డాక్టర్ కాబోయి.. యాక్ట్రెస్ అయ్యాను :మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : డాక్టర్ కాబోయి.. యాక్ట్రెస్ అయ్యాను :మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఇక్కడ తన ఫస్ట్ మూవీతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ అమ్మడు. సీతగా అందరిని ఆకట్టుకుంది. గతేడాది హాయ్ నాన్న సినిమాతో మృణాల్ అలరించింది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించిమృణాల్ ఠాకూర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.

అందులోతాను డాక్టర్ అవ్వాలనుకుని హీరోయిన్ గా మారినట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. డెంటిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో అందుకు సంబంధించిన కోర్సులో కూడా జాయిన్ అయినట్లు వెల్లడించింది. తరువాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరగడంతో.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపింది. ఓ ఆడిషన్ లో పాల్గోనడం, నటించడం వెంట వెంటనే జరిగిపోయినట్లు పేర్కొంది. ఆ మూవీనే మరాఠీ సినిమా హలో నందన్ అని మృణాల్ ఠాకూర్ వెల్లడించింది

Tags

Read MoreRead Less
Next Story