Mrunal Thakur : ముంబైలో ప్లాట్ కొన్న మృణాల్.. ధర ఎంతో తెలుసా?

Mrunal Thakur : ముంబైలో ప్లాట్ కొన్న మృణాల్..  ధర ఎంతో తెలుసా?

సినీ సెలబ్రిటీలు తాము చేసే సినిమాలను బట్టి, అందుకునే రెమ్యునరేషన్ బట్టి తమ డ్రీమ్ హౌజ్ ను ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఫైనల్ గా తన ఇల్లు మారాలని డిసైడ్ అయ్యింది. ముంబయ్ లో కంగనా రనౌత్ కుటుంబ సభ్యులకు చెందిన ఒక జోడీ ఫ్లాట్ (అంటే రెండు ఫ్లాట్స్ కాంబినేషన్) ను మృణాల్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆఫ్లాట్స్ ను తన టేస్ట్ కు తగినట్టుగా మార్చుకుంటోంది.

అసలు విషయం ఏంటంటే ఈ ఫ్లాట్స్ ధర ఎంతో బయటికొచ్చింది. దీని ధర విని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అన్ని కోట్లా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ముంబాయ్ లో కంగనా రనౌత్ తండ్రి, అన్నకు చెందిన జోడీ ఫ్లాట్స్ ను మృణాల్ ఠాకూర్

కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కంగనా రనౌత్ తండ్రి అమరీదీప్ సింగ్ రనౌత్, అన్న అక్షత్ దీప్ రనౌత్ పేర్ల మీద ఈ ఫ్లాట్స్ ఉన్నాయని సమాచారం.

అయితే వారి దగ్గర నుండి రూ.10 కోట్లు పెట్టి మృణాల్ ఠాకూర్ వాటిని కొనుగోలు చేసిందట. ప్రస్తుతం మృణాల్.. తన పాత ఇల్లు ఓబ్రాయ్ స్ప్రింగ్స్ లోనే నివాసముంటుంది. కొత్త ఫ్లాట్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ భామ.. కంగనా ఫ్యామిలీ నుండి ఆ ఫ్లాట్స్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు తన టేస్టుకు తగినట్టుగా ఆ ఫ్లాట్స్ ఇంటీరియర్ ను మార్చుకుంటోంది. త్వరలోనే అన్ని పనులు పూర్తయిపోయి కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వనుందట మృణాల్ .

Tags

Read MoreRead Less
Next Story