Mrunal Thakur : సీత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో?
హిందీ సీరియల్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). అనంతరం సీతారామం మూవీతో టాలీవుడ్ లోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా మంచి హిట్ కావడంతో ఈమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బాలీవుడ్ లో అవకాశాలు కాస్త తక్కువగా వస్తున్నప్పటకీ .. టాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది.
రీసెంట్ గా విడుదలైన హాయ్ నాన్న సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ ని మరింత పెరిగింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తోంది మృణాల్. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో ఈ బ్యూటీ నెక్స్ట్ సినిమా ఎంటనే దానిపై కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది.
విజయ దేవరకొండతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ ఆమె తరువాతి సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. మృణాలు టాలీవుడ్ లో చాలా అవకాశాలు వస్తున్నప్పటికీ.. కథ ఎంపికలో ఆచూతూచి అడుగెస్తుందట. గ్లామర్ రోల్స్ కి నో చెప్పేస్తుందట. కేవలం నటనపరంగా గుర్తింపు ఉన్న పాత్రలకే ఓకే చెప్తుందట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com