Munawar : రెండో పెళ్లి చేసుకున్న మునావర్.. అమ్మాయి ఎవరంటే?

Munawar : రెండో పెళ్లి చేసుకున్న మునావర్.. అమ్మాయి ఎవరంటే?
X

స్టాండప్ కమెడియన్, బిగ్‌బాస్-17 విన్నర్ మునావర్ ఫారూఖీ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మెహజ్‌బీన్ కోత్వాలాను ఆయన ముంబైలోని ITC హోటల్‌లో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పెళ్లిపై మునావర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

తన మొదటి పెళ్లి గురించి బిగ్ బాస్ 17లోనే మునావర్ వెల్లడించాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం అని, వాళ్లకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. అది వర్కౌట్ కాలేదని అతడు చెప్పాడు. ఆమె గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని, కానీ తమ మధ్య పెళ్లి బంధం మాత్రం నిలవలేదని స్పష్టం చేశాడు. ఇక 2022లో కంగనా హోస్ట్ చేసిన లాకప్ షోలోనూ మునావర్ దీని గురించి చెప్పాడు.అతడు జాస్మిన్‌ను పెళ్లాడగా వారికి ఓ అబ్బాయి పుట్టాడు.

Tags

Next Story