Anushka Shetty : అతడితోనే నా పెళ్లి : అనుష్క క్లారిటీ

'సూపర్'తో వెండితెరపై అరంగేట్రం చేసిన అందాల భామ అనుష్క.. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్లో తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోలందరితోనూ జతకట్టి.. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయంతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. స్వీటీ కెరీర్ లో 'బాహుబలి' ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రే మాయణం నడుస్తోందని, త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వదంతులన్నింటినీ అనుష్క, ప్రభాస్ ఇద్దరూ పలుమార్లు కొట్టిపడేశారు. ఆ తర్వాత ఒక పెద్ద వ్యాపారవేత్తతో స్వీటీ వివాహం గురించి వార్తలు వచ్చాయి. కానీ అవి కూడా నిజం కాలేదు. ఇలా అనుష్క మ్యారేజ్ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పెండ్లిపై క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు. 'బాహుబలి' తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి ఎక్కు వైంది. కుటుంబ సభ్యులే కాదు, మీడియా నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. నాకు మ్యారేజ్ పై పూర్తి నమ్మకం ఉంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అయితే నేను ప్రేమ లేకుండా ఎవరినీ పెళ్లి చేసుకోను. ఏమైనా సరే నేను ఇష్టపడిన వ్యక్తినే టైమొచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా. నా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో నా నిర్ణయానికి మద్దతు ఇస్తారు. అయితే నేను సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను’ అంటూ అనుష్క క్లారిటీ ఇచ్చింది. ఇక ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ తీ సుకున్న స్వీటీ.. త్వరలో నే 'ఘాటి'తో ప్రేక్షకుల ముందుకురానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com