Naa Saami Ranga : 'నా సామిరంగ' OTTలోకి వచ్చేసింది.. చూస్తున్నారా మరి

Naa Saami Ranga : నా సామిరంగ  OTTలోకి వచ్చేసింది.. చూస్తున్నారా మరి

Naa Saami Ranga : సంక్రాంతి కానుకగా వచ్చిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) 'నా సామిరంగ' (Naa Saami Ranga). మూవీ సూపర్ హిట్ గా నిలచింది. పండుగ పూట కాంపిటీషన్ లోనూ నిలబడి వందకోట్లు రాబట్టింది ఈ సినిమా. విజయ్ బిన్నీ రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

శ్రీనివాస చిట్టూరి 'నా సామిరంగ'ను నిర్మించారు. కీరవాణి సంగీతం చార్ట్ బస్టర్ లో ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైన ఈ మూవీలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా సపోర్టివ్ రోల్స్ పోషించారు.

యూత్ క్రష్ ఆషిక రంగనాథ్ ఈ మూవీతో అన్ని వర్గాలకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచే 'నా సామిరంగ' మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లో చూడని వారు.. ఇప్పుడు ఓటీటీలో చూసేయండి.

Tags

Read MoreRead Less
Next Story