Nabha Natesh : అపరిచితుడులా నభా నటేశ్|

‘అపరిచితుడు’లో ఒకే ఫ్రేమ్ విభిన్న హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు నటుడు విక్రమ్. 'డార్లింగ్' లో హీరోయిన్ నభా నటేశ్ ( Nabha Natesh ) అచ్చం అలానే కనిపించనున్నారు. సీరియస్ రోల్ కాదుగానీ ఫన్నీ క్యారెక్టర్ ప్లే చేశారు. ప్రియదర్శి హీరోగా రూపొందిన చిత్రమిది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న డార్లింగ్ సినిమాను ఈనెల 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ని ఇవాళ రిలీజ్ చేసింది. 2 నిమిషాల 29 సెకన్ల నిడివి గల డార్లింగ్ ట్రైలర్.. 'ఆ అబ్బాయి చిన్నప్పటినుంచి అన్నిట్లో ఫస్ట్, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు' అనే డైలాగ్ ఆరంభం అయింది. 'మంచి అమ్మాయిని పెళ్లి చేస్కుని ప్యారిస్కి హనీమూన్ తీసుకెళ్తా మిస్'. ‘బలైపోయే మేకకు బలుపెక్కువట', 'దీనమ్మ.. పెద్ద మహానటిరా ఇది', ‘నా పెళ్లాం బెల్లం రా' అనే డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com