Nagarjuna : మల్టీస్టారర్ మూవీస్ తో నాగార్జున బిజీ

Nagarjuna : మల్టీస్టారర్ మూవీస్ తో నాగార్జున బిజీ

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే నాగార్జున.. కొత్త పంథాలో వెళ్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ కు తెలుగు రీజినల్ ఐడెంటిఫికేషన్ పరంగా కేరాఫ్ గా మారారు. నాగార్జున మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ.. కొత్త ట్రెండ్ లో వెళ్తున్నారు.

నాగార్జున చేస్తున్న, చేయబోతున్న సినిమాల లిస్ట్ చూస్తే.. కథలన్నీ ఎక్కువ హీరోలు ఉన్నవే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న 'కుబేర'లో నాగ్ నటిస్తున్నాడు. నాగ్ కూడా షూటింగ్ లో పాలు పంచుకొంటున్నారు.

రజనీకాంత్ కూలీ సినిమాలో నాగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో నాగార్జున మార్కెట్ మరింత పెరగడం ఖాయం. మరోవైపు అక్షయ్‌కుమార్‌తో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. నా సామిరంగ హిట్ అందించిన డైరెక్టర్ బిన్నీకి నాగ్ మరో చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సోలో మూవీ పట్టాలెక్కబోతోంది

Tags

Read MoreRead Less
Next Story