Nagashaurya Mother : సినిమా హిట్టే.. మాకు డబ్బులివ్వలేదు: నాగశౌర్య తల్లి

Nagashaurya Mother : సినిమా హిట్టే.. మాకు డబ్బులివ్వలేదు: నాగశౌర్య తల్లి

హీరో నాగశౌర్య కెరీర్లో మంచి హిట్‌గా నిలిచింది ‘ఛలో’. అయితే ఆ మూవీకి తమకు డబ్బులు రాలేదని ఆయన తల్లి ఉష మూల్పూరి ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ సినిమా కోసం శౌర్య చాలామంది నిర్మాతల దగ్గరకు తిరిగాడు. అదంతా వద్దని మేమే నిర్మాతలుగా మారాం. ఆ సినిమా హిట్ అయినా డిస్ట్రిబ్యూటర్లెవరూ డబ్బులివ్వలేదు. అదే ‘నర్తనశాల’కు మాత్రం ఫ్లాపవ్వగానే ఉదయాన్నే డబ్బు కోసం ఆఫీసుకొచ్చి కూర్చున్నారు’ అని తెలిపారు.

చిన్నప్పుడు నాగశౌర్య పెద్దగా చదువుకునేవాడు కాదు. అందువలన నేను కొట్టేదానిని. నాగశౌర్య హీరోగా ట్రై చేస్తానని అంటే నేను వద్దనే అన్నాను. కానీ ఆ తరువాత సరే అనాల్సి వచ్చిందిఅని అన్నారు. ఇక నాగశౌర్య హీరోగా తనంతట తానుగా కష్టపడుతూ అవకాశాలు తెచ్చుకున్నాడు. అందులో మా ప్రమేయమేమీ లేదన్నారు.

హిట్స్ ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అప్పుడెప్పుడో చలో సినిమాతో హిట్ అందుకున్నాడు నాగ శౌర్య. వెనకే కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఇప్పటివరకు హిట్ మాత్రం అందుకోలేకపోయాడు నాగ శౌర్య. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.

Tags

Next Story