OTT : ఓటీటీలోకి బ్రీత్ సినిమా.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే?
నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా చేసిన బ్రీత్ సినిమా ఎట్టకేలకి ఓటీటీలోకి రాబోతుంది. మరి ఈ సినిమాను ఓ ఓటీటీలో, ఎప్పటినుంచి చూడొచ్చో వివరాలు చూద్దాం. మార్చి 8 నుంచి ఆహా ఓటీటీలో (బ్రీత్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత బ్రీత్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
బ్రీత్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియల్‌గా ప్రకటించింది. ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదని పేర్కొన్నది. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రక్ష’, ‘జక్కన్న’ చిత్రాల ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో ఈ సినిమా నిర్మించినట్టు సమాచారం.
ఇక బ్రీత్ సినిమా విషయానికొస్తే… రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరుతాడు. ఆయనను చంపడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యమంత్రిని కాపాడేందుకు ఓ సాధారణ యువకుడు ఏం చేశాడు? అసలు అతను ఎవరు? ముఖ్యమంత్రితో ఉన్న సంబంధం ఏమిటి అన్నదే బ్రీత్ మూవీ కథ. మరి థియేటర్లలో నిరాశపర్చిన ఈ సినిమా ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com