Naveen : లక్ష్మణుడిగా జాతిరత్నం.. ఇదెక్కడి మాస్ ఆఫర్ రా మావ
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి (Nitish Tiwari) డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొందుతుందని చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడు పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా నటించనున్నరంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.
జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టిని ఓ లీడ్ రోల్ పాత్రకు ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణ ఇతిహాసంలో ఎప్పుడు రాముడికి వెన్నంటే ఉండే లక్ష్మణుడి పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తాడని.. నార్తిండియా ఫేస్ కట్ ఆయన ప్లస్ పాయింట్ అని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో నవీన్ తో ఈ పాత్ర చేసేందుకు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ పాత్రకు నవీన్ పూర్తిగా సెట్ అవుతాడని దర్శకుడు నితాష్ తివారి ఫిక్స్ అయ్యారట. తెలుగు కంటే ముందే హిందీ సినీ పరిశ్రమంలోకి నవీన్ పొలిశెట్టి అడుగుపెట్టిన సంగతి చాలామందికి తెలుసు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com