Rajamouli : రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

దర్శకధీరుడు రాజమౌళిపై ( Rajamouli ) ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ స్పెషల్ డాక్యుమెంటరీ రూపొందించింది. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్'లతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నారు రాజమౌళి. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించింది సంస్థ.
'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఓ సిరీస్ ను స్ట్రీమ్ చేయబోతోంది నెట్ ఫ్లిక్స్. నేటి కాలంలో ప్రపంచ సినిమా మేధావులను ఈ సిరీస్ లో చూపించబోతోంది. మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపొందనున్న మూవీకి రాజమౌళి డాక్యుమెంటర్ ప్రమోషన్ లా అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్.. మహేశ్ కు జోడీగా నటిస్తుందని సమాచారం. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీ రోల్ దక్కించుకున్నారని టాక్ నడుస్తోంది.
వరుస విజయాలతో లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి అందుకోసం ఎంత కష్టపడ్డారు అనేది 'మోడ్రన్ మాస్టర్స్' లో చూపించబోతున్నారు. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమ్ కానుంది. అనుపమా చోప్రా దీనికి హోస్ట్ గా ఉంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com