జోడీ కుదిరింది.. చరణ్తో జాన్వీకపూర్

జోడీ కుదిరింది.. చరణ్తో జాన్వీకపూర్

'జగదేకవీరుడు - అతిలోకసుందరి' చిత్రంలో చిరంజీవి (Chiranjeevi). శ్రీదేవి (Sri Devi) కలిసి నటించారు. సోసియో ఫాంటసీ కథతో తీసిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు వీరి వారసులు రామ్ చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ (Janhvi Kapoor) కలిసి సినిమా నటిస్తుండటం విశేషం. కొద్ది రోజులుగా చరణ్ సినిమాలో జాన్వీకపూర్ నటించనుందని వార్తలు హల్ చల్ చేశాయి. దీన్ని నిజం చేస్తూ శ్రీదేవి భర్త, జాన్వీ తండ్రి బోనీకపూర్ ప్రకటన చేశారు.

జాన్వీ కపూర్ ఇప్పటికే జూ. ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా నిర్మాణంలో ఉంది. దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు. రామ్ చరణ్ 16వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. ఈ చిత్రంలోనే జాన్వీకపూర్ ను హీరోయిన్ గా ఎంపికచేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమిది.

ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో, క్రీడా ప్రధానాంశాలుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడిషన్స్ సైతం జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలియడంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. మరో విషయం జాన్వీ కపూర్ తమిళంలో కూడా సూర్యతో ఓ సినిమా చేయనుందని బోనీకపూర్ వెల్లడించారు. తల్లి (శ్రీదేవి)లాగే తనయ కూడా భారతీయ భాషా చిత్రాల్లో నటిస్తుండటం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story