Nidhi Agarwal : నిధి అగర్వాల్ కొత్త ఫొటోలు.. సోషల్‌ మీడియాలో వైరల్

Nidhi Agarwal : నిధి అగర్వాల్ కొత్త ఫొటోలు.. సోషల్‌ మీడియాలో వైరల్
X

తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. 2017లో వచ్చిన మున్నా మైకేల్ మూవీ ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. మరుసటి ఏడాది సవ్యసాచి మూవీలో నాగచైతన్యకు జోడీగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమా లతో హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకుంది. ఇటీవల పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటించింది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటు సింబల్ ను మిర్రర్ న్న ఫొటోలను షేర్ చేసింది. సీతాకోక చిలుక ఈ ఫొటోలకు క్యాప్షన్ గా జోడించింది. పొదిగిన డ్రెస్ ధరించి తళుకు బెలుకుల అందాలతో పాక్షికంగా ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. నిధి అగర్వాల్ షేర్ చేసిన కొన్ని సెకండ్లలోనే ఫొటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీని మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags

Next Story