Thammudu First Look : నితిన్ బర్త్ డే.. ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్

Thammudu First Look : నితిన్ బర్త్ డే..  ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ హీరో నితిన్ (Nithin) బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ‘తమ్ముడు’ (Thammudu) టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ఓ గిరిజన మహిళ అగ్రెసివ్ లుక్ లో చుట్ట కాలుస్తూ బస్సు నడుపుతుంటే ఆ బస్సు పైన ఒక ఈటె పట్టుకొని స్టైల్ గా కూర్చుని నితిన్ కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. గత సంవత్సరం ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి వర్క్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం. అక్క– తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని టాలీవుడ్‌ టాక్‌.

Tags

Read MoreRead Less
Next Story