Nivetha Pethuraj : నివేదా పోలీసులతో గొడవ..స్టంటేనా?

Nivetha Pethuraj : నివేదా పోలీసులతో గొడవ..స్టంటేనా?
X

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవపడింది. కారును చెక్ చేయాలి అన్నందుకు వారిపై కోపానికొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. కారులో వెళుతున్న నివేదా పేతురాజ్ ను పోలీసులు ఆపారు. మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది.. మీ కారును చెక్ చేయాలన్నారు. డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. అందుకు నిరాకరించిన నివేదా.. కొంచెం అర్జెంట్ పని ఉంది డిక్కీ ఇప్పుడు ఓపెన్ చేయలేనని చెప్పింది.

తన దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయని.. కావాలంటే చెక్ చేసుకోండని పోలీసులకు వెల్లడించింది. పోలీసులు ఆమె మాటలు వినకపోవడంతో.. ఇది పరువుకు సంబంధించిన విషయమని మండిపడింది. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదని.. వీడియో తీయడం ఆపండని కోప్పడింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

పోలీసులతో గొడవేంటని నివేదా పై కొందరు మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం ఇది సినిమా ప్రమోషన్స్ భాగంగా చేసిన స్క్రిప్ట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే టాలీవుడ్ వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది.

Tags

Next Story