Nivetha Pethuraj : వదంతులు నమ్మొద్దు.. నివేదా ఎమోషనల్ ట్వీట్

నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) 'మెంటల్ మదిలో' (Mental Madhilo) సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ (Tollywood Entry) ఇచ్చిన హీరోయిన్. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నివేదా పై తమిళ మీడియాలో నెగిటివ్ వార్తలు వచ్చాయి. ఆమెపై కొందరు డబ్బు ఖర్చుపెడుతున్నా రని, దుబాయ్ విలాసవంతమైన జీవితం గడుపుతోందన్నది ఆ వార్తల సారాంశం. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఆమెకు 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె ట్వి ట్టర్ వేదికగా స్పందించారు.
ఇటీవల నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నేను వీటిపై మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్లు ఒక అమ్మాయి జీవి తాన్ని నాశనం చేసేముందు ఆ సమాచారం నిజమా కాదా అని ధ్రువీకరించుకోవాలి. ఈ వార్తలతో నేను, నా కుటుంబం గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒకసారి ఆలోచించండి.
మేము 2002 నుంచి దుబాయ్ లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. అలాగే, 2013 నుంచి రేసింగ్ అంటే నాకు ఫ్యాషన్. నిజానికి చెన్నైలో రేసులపై నాకు తెలియదు. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మెంటల్ గా, ఎమోషనల్ గా మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరు కున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా ను.
జర్నలిజంలో కొంత మాన వత్వం మిగిలి ఉందని, ఇకపై వారు ఇలా పరువుకు భంగం కలిగించరని నేను ఇప్పటికీ నమ్ము తున్నాను. అందుకే దీనిపై చట్టబద్ధం గా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దు' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com