Actress Ashi Roy : అది రేవ్ పార్టీ కాదు.. ఆషీరాయ్ షాకింగ్ కామెంట్స్

Actress Ashi Roy : అది రేవ్ పార్టీ కాదు..  ఆషీరాయ్ షాకింగ్ కామెంట్స్

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ.. ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో పలువులు టాలీవుడ్ నటీనటులు పాల్గొన్నారనే వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రేవ్ పార్టీపై నటి ఆషీరాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అది రేవ్ పార్టీ కాదని.. బర్త్ డే పార్టీ అని చెప్పుకొచ్చింది.

వాసు అన్నయ్య పిలిస్తేనే.. అది బర్త్ డే పార్టీ అనుకుని వెళ్లానని తెలిపింది. లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా బెంగళూరు నగర శివార్లలో జరిగిన ఈ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.

ఈ పార్టీకి హాజరైన వారిలో ప్రధానంగా హేమా, శ్రీకాంత్ ల పేర్లు వినిపించగా.. దానిపై వారు క్లారిటీ ఇచ్చారు. వీడియోలు విడుదల చేస్తూ.. తాము పార్టీలో లేమని తెలిపారు. అయితే ఈ పార్టీకి మొత్తం 101 మంది హాజరైనట్లు బెంగళూరు సీపీ తెలిపారు. ఇప్పటివరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్ తీసుకున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

Tags

Next Story