Devara Movie : ముందుకు జరిగిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్!

పాన్ ఇండియా మూవీ, ఎన్టీఆర్ మాగ్నమ్ ఒపస్ మూవీ దేవర ( Devara ). యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( JR NTR ) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్.. పలు పోస్టర్లు దేవర సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ ను ఇస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. దేవర సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నామని డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే చెప్పారు. మొదటి పార్ట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం కాబోతుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తామని ముందు చెప్పారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. రజనీకాంత్ వేటగాడు రిలీజ్ అవుతుందని.. అందుకే తాము ఇంకాస్త ముందుగానే విడుదల చేస్తున్నట్లు దేవర చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు వారాల ముందే సినిమాను విడుదల చేస్తామని చెప్పింది. సెప్టెబర్ 27వ తేదీన దేవర వస్తున్నట్లు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com