Devara Movie : దేవర సినిమాలో ఎన్టీఆర్ లక్కీ హీరోయిన్ ఐటెం సాంగ్

ఓ స్టార్ హీరోయిన్ దేవర సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిందట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ దేవర. ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది.
దేవరలో సినిమాలో శ్రీకాంత్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ సీక్వెన్సులే హైలైట్ గా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. అదే స్థాయిలో మాస్, గ్లామర్ అంశాలుంటాయని చెబుతున్నారు. ఒకప్పుడు జనతా గ్యారేజ్ లో కాజల్ ను ఐటమ్ సాంగ్ లో రసరమ్యంగా చూపించిన ఎన్టీఆర్.. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయించేందుకు ఒప్పించారని టాక్.
దేవరలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చేసిందట. రంగస్థలం జిగేల్ రాణి పాట ఇప్పటికీ పాపులర్. దీంతో.. ఇదే శైలిలో సాగేలా ఉన్న పాట కావడంతో.. మళ్లీ ఆమెనే ఫిక్స్ చేశారట. పూజా హెగ్డే సెక్సీ ఫిగరే మరో అవకాశం తెచ్చిపెట్టిందని.. ఎన్టీఆర్-పూజా అరవింద సమేత కాంబినేషన్ కూడా హిట్ కావడంతో.. మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com