Devara Promotions : దేవర ప్రమోషన్స్.. ఈశాన్య రాష్ట్రాలకు ఎన్టీఆర్ !

Devara Promotions : దేవర ప్రమోషన్స్.. ఈశాన్య రాష్ట్రాలకు ఎన్టీఆర్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ (Pan India Star) అయిపోగా.. మరో ముగ్గురు హీరోలు కూడా ఆ రేంజ్ కు వెళ్లిపోయారు. వాళ్లే రాంచరణ్, ఎన్టీఆర్, బన్నీ. ఇక వీరి ప్రతి అడుగు పాన్ ఇండియా ప్రేక్షకుల కోసమే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ గ్లోబల్ లెవల్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు తారక్ కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ 'దేవర' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ, సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో నటిస్తుండటంతో మరింత హైప్ పెరిగింది.

కోస్టల్ బ్యాగ్ డ్రాప్ తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన ఫైట్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. ఇక ఈ 'దేవర'లో అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలవనుంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ఇదివరకే పూర్తిచేయగా, తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచేందుకు వీఎఫ్ఎక్స్ సైతం జోడించనున్నారు. హై రేంజ్ యాక్షన్ తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల అని అనుకున్న అది వాయిదా పడే చాన్స్ ఉన్నటు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ 2 నెలలు కేటాయించాడని తెలిసిందే. అంతేకాదు, దేశవ్యాప్తంగా 27 ప్రదేశాల్లో ఈవెంట్లు లేదా ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడట. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ ఏ హీరో వెళ్లని ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎన్టీఆర్ వెళ్తున్నాడని సమాచారం. అదే జరిగితే ఆ రాష్ట్రాలకు వెళ్లి ప్రమోట్ చేసిన తొలి హీరోగా అతడు రికార్డు సాధించినట్లు అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story