Re-Release : 4 కే ప్రింట్‌తో నువ్వు నేను రిరిలీజ్.. ఎప్పుడంటే?

Re-Release : 4 కే ప్రింట్‌తో నువ్వు నేను రిరిలీజ్.. ఎప్పుడంటే?

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆయన హీరోగా నటించిన నువ్వు నేను మూవీ తెలుగు నాట సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 23 ఏళ్ల తర్వాత ఇదే మూవీ రీరిలీజ్ కు రెడీ అయింది.

నువ్వు నేను మూవీ లో అనిత హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుడు తేజ ఈమూవీని డైరెక్ట్ చేశారు. ఆయన మేకింగ్, టేకింగ్, ఆర్పీ మ్యూజిక్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ లుగా నిలిచిపోయాయి.

పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా.. 2001 ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ పనులను మేకర్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నువ్వు నేను 4కే ప్రింట్ తో మార్చి 21న థియేటర్స్ లో రీరిలీజ్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story