Akhanda Heroine : అఖండ హీరోయిన్కు ఆఫర్లు కరువు

Akhanda Heroine : అఖండ హీరోయిన్కు ఆఫర్లు కరువు

చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే అతి కొద్ది మంది హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా సరైన ట్రాక్ లోకి అయితే రాలేకపోతోంది. మొదట్లో కొన్ని డీసెంట్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె చేసిన కొన్ని సిని మాలు దారుణంగా దెబ్బకొట్టడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి.

అయితే ఈ బ్యూటీ అందం విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా నిరాశపరచలేదు. ప్రతి సినిమాలో కూడా తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. ముఖ్యంగా ఆమె నటించిన కంచే సినిమా అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇక గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక లాంటి సినిమాలలో చేసిన పాత్రలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా 2021లో బాలయ్య బాబుతో చేసిన అఖండ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

సరైన సినిమా తగిలితే మాత్రం ప్రగ్యా టాప్ పొజిషన్ లో ఉంటుంది అని మరి కొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరిగా ఈ బ్యూటీ తెలుగులో అయితే మోహన్ బాబుతో సన్నాఫ్ ఇండియా సినిమా చేసింది. ఆ తర్వాత మరో రెండు కథలు

చర్చల దశలో ఉన్నప్పటికీ ఎందుకో సెట్ అవ్వలేదు. ప్రస్తుతం చేతిలో కేవలం ఒక హిందీ సినిమా మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ల సమాచారం. మరి ఈ గ్లామరస్ అందాలతో అమ్మ టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story