Official News : ఆఫీషియల్ .. రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బంపరాఫర్ దక్కించుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. జాన్వీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ 'RC16' మూవీలోకి స్వాగతం పలికింది.
ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది జాన్వీ. అదిరిపోయే కాంబో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో శ్రీదేవితో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ కాంబో కూడా అదే రేంజ్‌లో ఉంటుందంటూ ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది తెలుగులో జాన్వీకు రెండో సినిమా కానుంది.
ఇప్పటికే ఈ అమ్మడు 'దేవర' మూవీలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ హీరోగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్-1’ పేరుతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com