OG Movie : ఓజి లో పవన్ కళ్యాణ్ పేరు ఇదే : సుజీత్

OG సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ‘ఓజాస్ గంభీర’ అని దర్శకుడు సుజీత్ వెల్లడించారు. కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ ప్రమోషన్స్‌లో భాగంగా OG సినిమా విశేషాల్ని పంచుకున్నారు. మొదట పవన్ తనను రీమేక్ కోసం పిలిచారని, తర్వాత కొత్త కథ ఏదైనా ఉందా? అని అడిగితే OG స్టోరీ చెప్పానని తెలిపారు.
అది ఆయనకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కిందని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు ప్రకృతి అలా సహకరించింది. ఒక్క లైన్ చెప్పగానే ఆయన చేయడానికి అంగీకారం తెలిపార’’న్నారు సుజీత్. ‘ఒ.జి’లో పవన్‌కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఓజీ అంటే సాధారణంగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. కానీ తమ సినిమా టైటిల్ ఓజీకి అర్థం వేరంటున్నాడు సుజీత్. ఇందులో ఓ అంటే ఓజాస్, జీ అంటే గంభీర్ అని అర్థం అంటున్నారు. సినిమాలో ఓజాస్ అనే మాస్టర్ పేరు, ఇక గంభీర్ అనేది హీరో పేరు. అందుకే ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ పెట్టినట్టు వెల్లడించాడు.
ఈ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ మరో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సినిమా పూర్తయిపోతుందని అంటున్నాడు సుజీత్. అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ట్రయిలర్ కూడా రెడీ చేసి పెట్టాడట ఈ దర్శకుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com