Shobhita : ఒక్క లైక్ తో మళ్లీ పుకార్లు

Shobhita : ఒక్క లైక్ తో మళ్లీ పుకార్లు
X

శోభితా ధూళిపాళ.. ఏపీకి చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమా రామన్ రాఘవ్ 2.0 తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరిన్ని హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక అడవి శేషు హీరోగా వచ్చిన 'గూఢచారి' తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా..ఇక్కడ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. దీంతో టాలీవుడ్ లో అంతగా అవకాశాలు అందట్లేదు. టాలీవుడ్ లో అవకాశాలు రాకపోతేనేం ఏకంగా హాలీవుడ్ లోకే ఈ బ్యూటీ అడుగుపెట్టింది.

దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మంకీ మ్యాన్ తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా నాగచైతన్యతో శోభిత ప్రేమలో ఉందంటూ కొద్ది రోజుల క్రితం పుకార్లు షికార్లు చేశాయి. త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ రూమర్స్ ని వీరిద్దరూ కొట్టిపారేశారు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

నాగచైతన్య తన ఇన్స్టాఖాతాలో ఓ ఫోటోని షేర్ చేయగా.. ఆ ఫొటోకి శోభిత లైక్ కొట్టింది. దీంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయి. ఆ ఫొటో తీసింది శోభితనే అని.. వారిద్దరు కలిసే బయటకు వెళ్లారని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేం లేదని.. జస్ట్ లైక్ కొట్టినంత మాత్రాన ప్రేమలో ఉన్నారనడం తప్పని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Tags

Next Story