The Goat Life OTT Release : ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

The Goat Life OTT Release : ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ థ్రిల్లర్
X

మలయాళీ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ ది గోట్ లైఫ్’ మూవీ ఈ ఏడాది మార్చిలో రిలీజై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళీ నవల ‘ఆడు జీవితం’ ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ యాక్టింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ.82 కోట్లతో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజై రూ.160 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో ‘ఆడు జీవితం’ పేరుతో రిలీజై.. ఇక్కడి ఆడియెన్స్ ను మెప్పించింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది.

Tags

Next Story