Deepika Padukone : మన సినిమాలకు గుర్తింపు రావట్లేదు : దీపికా పదుకొణె

Deepika Padukone : మన సినిమాలకు గుర్తింపు రావట్లేదు : దీపికా పదుకొణె
X

సినిమా పరిశ్రమలో అతిపెద్ద అవార్డు ఆస్కార్. దానిని సొంతం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా నటీ నటులు, దర్శకులు, సంగీత నృత్య దర్శకులు పోటీపడుతూ ఉంటారు. అయితే మనకు ఆస్కార్ అవార్డుల్లో అన్యాయం జరుగుతోందని చెబుతోంది దీపికా పదుకొణె. కథ పరంగా గొప్పగా ఉన్న సినిమాలు సైతం అవార్డును దక్కించుకోలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 'ఆర్ ఆర్ ఆర్' కి ఆస్కార్ని ప్రకటించగానే అక్కడే ఉన్న తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని తెలిపింది. తనకు ఆ మూవీతో ఎలాంటి సంబంధం లేకున్నా ఒక భారతీయురాలిగా ఎంతో ఆనందపడ్డానని తెలిపింది. ఇక ఈ ఏడాది 'ది బ్రుటలిస్టు' చిత్రానికి అడ్రిన్ బ్రాడి ఉత్తమ నటుడుగా నిలిచినందుకు కూడా ఎంతో ఆనందం వేసిందని చెప్పుకొచ్చింది. దీపిక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2006లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి 'ఓం శాంతి ఓం' మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతక ట్టింది ఈ భామ. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన దీపిక తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో సినిమాలో వివిధ పాత్రలతో ప్రజంట్ అగ్ర హీరోయిన్లో ఒకరుగా కొనసా గుతు వస్తోంది దీపిక. ఇక గత సంవత్సరం ప్రభాస్ తో 'కల్కి 2898 ఏడి' మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇక్కడ కూడా తన సత్తా చాటింది.

Tags

Next Story