Tripti Dimri : యానిమల్‌లో బోల్డ్ సీన్స్ చూసి నా పేరెంట్స్ భయపడ్డారు : త్రిప్తి డిమ్రి
ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకొన్న నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri). ‘యానిమల్’ చిత్రంలో ఆమె పాల్గొన్న బోల్డ్ సీన్లు చూసి ‘ఎవరీమె’ అంటూ గూగుల్‌లో ఆరా తీశారెందరో. ఆ సినిమా తర్వాత త్రిప్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. కొత్త అవకాశాలు కూడా ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. అయితే ‘యానిమల్’లో ఆమె చేసిన సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో కొందరు ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి వివరణ ఇచ్చింది త్రిప్తి. ‘దర్శకుడు సందీప్ వంగా ఆ చిత్ర కథ గురించి చెప్పినప్పుడు నాది చాలా చిన్న పాత్ర అని స్పష్టంగా చెప్పారు. అయినా ఆ పాత్ర ఆసక్తికరంగా ఉండడంతో అంగీకరించాను. ప్రేక్షకులు ఏమనుకుంటారు, విమర్శలు వస్తాయా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏ పనీ చేయలేం. నిజం చెప్పాలంటే ‘యానిమల్’లో నేను పాల్గొన్న శృంగార సన్నివేశాలు చూసి అమ్మా, నాన్న ఉలిక్కిపడ్డారు.
ఇదేమిటని నన్ను నిలదీశారు. సినిమాకు ఆ సీన్ ఎంత ముఖ్యమో నేను వివరించిన తర్వాత వాళ్లు ఏమీ మాట్లాడలేదు. నా తొలి సినిమా ‘లైలా మజ్ను’ విడుదలైనప్పుడు నాన్న నా గురించి గొప్పగా చెప్పాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ‘యానిమల్’ విడుదలైన తర్వాత అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. ఇలా గుర్తింపు తెచ్చుకోవడానికి నాకు ఇంత టైమ్ పట్టింది’ అంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com