Parineeti Chopra : అతన్ని చూడగానే పడిపోయా: పరిణీతి

సెలబ్రిటీలు చెప్పే పర్సనల్ సంగతులు వైరల్ గా మారుతుంటాయి. అలా బీటౌన్ హీరోయిన్ పరిణీతి చోప్రా చెప్పిన కొన్ని సంగతులు ఆసక్తికరంగా మారాయి. పరిణితి చోప్రా ప్రేమ వ్యవహారం కొన్ని రోజులపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ ట్రాఫిక్ గా మారిపోయింది.
హీరోయిన్ పరిణీతి చోప్రా ఓ రాజకీయ నాయకుడితో ప్రేమలో పడింది. ఆప్ ఎంపీ అయిన రాఘవ్ చద్దాతో ఎన్నో రోజులపాటు పరిమితి చోప్రా ప్రేమలో మునిగి తేలింది. వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఎన్నో వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్ లో వీరిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. తొలిసారి రాఘవ్ ను లండన్ లో కలిసానననీ.. ఆయనతో మాట్లాడిన ఐదు నిమిషాలకే ప్రేమలో పడిపోయానని పరిణీతి తెలిపింది. తనకు కాబోయే భర్త అతనే అనిపించిందనీ... అప్పటికి ఆయన గురించి ఏమీ తెలియదని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com