Pawan Kalyan : సినిమాల్లో నేను ఎవరికీ పోటీ కాను.. పవన్ హాట్ కామెంట్స్
X
By - Manikanta |15 Oct 2024 10:15 AM IST
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పల్లె పండుగ' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సినిమాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులు.. 'ఓజీ' అంటు నినాదాలు చేయగా దానికి పవన్.. 'ముందు బాధ్యత.. ఆ తర్వాత వినోదం. సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను.
ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని.. ఇలా అందరూ బాగుండాలి' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com