6 Languages :ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడే పవన్ హీరోయిన్.. ఎవరో తెలుసా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) ఉన్న క్రేజ్ కు బాక్సాఫీస్ లు బద్దలవుతుంటాయి. సినిమాలైనా.. పాలిటిక్స్ అయినా పవన్ కల్యాణ్ ఓ పవర్ హౌజ్ గా చెప్పొచ్చు. పొలిటికల్ గా ఎన్నికల్లో ఓట్ల సంగతి అలా ఉంచితే.. సినిమాలకు బాక్సాఫీస్ లో తెగే టికెట్లు మాత్రం భారీస్థాయిలో ుంటాయి.
పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే నటనలో వాళ్ళ సత్తా చాటుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్ హీరోయిన్ ఏకంగా 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరోకాదు.. నిత్యా మీనన్.
పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాతో మంచి కాంబినేషన్ అనిపించుకుంది నిత్య మీనన్ (Nithya Menon). మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఫ్యాన్స్, ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిత్యమీనన్ ఏకంగా 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుందట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ లో బఠాణీలు తిన్నంత ఈజీగా మాట్లాడుతుందని చెబుతున్నారు. భాష రావడంతో.. డబ్బింగ్ కూడా సొంతంగా చెప్పుకుంటుందట. నిత్యా మీనన్ నిజంగా టాలెంట్ ఉన్న హీరోయిన్ అంటున్న ఫ్యాన్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com