Payal Rajput : నన్ను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

Payal Rajput : నన్ను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్
X

టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘RX100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సంచలన ఆరోపించారు. ‘2019లో రక్షణ అనే సినిమాలో నటించా. నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రమోషన్లకు రాలేనని నా టీమ్ వారికి చెప్పింది. అయినా ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

అగ్రిమెంట్ ప్రకారం నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. రక్షణ సినిమాకు డిజిటల్ ప్రమోషన్ల కోసం నా టీమ్ వారితో చర్చించేందుకు ప్రయత్నించింది. రెమ్యూనరేషన్ బకాయిలు ముందుగా చెల్లించాలని కోరింది. అయితే, వారు దానికి అంగీకరించలేదు. ప్రమోషన్స్ కు రాకపోతే, నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని వారు బెదిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరు వాడుతున్నారు. ఇది అసలు సరికాదు. ఈ మూవీలో నా పేరు, పాత్ర ఉంటే చట్టపరచర్యలు తప్పవు’అని Xలో ఆమె పోస్ట్ చేశారు.

కాగా, రక్షణ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ ఠాకూర్ నిర్మాతగానూ ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‍ను టీమ్ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.

Tags

Next Story