Film Makers Warning : ఫొటో లీక్.. ఫౌజ్ మేకర్స్ వార్నింగ్

Film Makers Warning : ఫొటో లీక్.. ఫౌజ్ మేకర్స్ వార్నింగ్
X

డార్లింగ్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కు తోన్న మూవీ 'ఫౌజీ'. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. 1940వ దశకంలో జరిగే కథగా.. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడాని కి ఓ యోధుడు చేసే పోరాటంగా మూవీ రానుంది. అయితే ఇటీవల సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేశారు. అందులో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపించడంతో అది క్షణాల్లో వైరలైంది. దీనిపై మేకర్స్ ఫైర్ అయ్యారు. 'ఈ సినిమా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. షూటింగ్ టైంలో సెట్స్ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చినట్లు గుర్తించాం. మీకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నం. కానీ ఇలాంటి లీకులు వాటిని దెబ్బతీస్తాయి. షేర్ చేసిన వారి అకౌంట్స్ ని బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ కేసులు పెడతాం' అని మేకర్స్ వార్నింగ్ ఇచ్చారు.

Tags

Next Story