Bangalore : పబ్ పై పోలీస్ కేసు.. ఆ తర్వాతే నిర్మాత హఠాన్మరణం

సౌందర్య జగదీష్.. కన్నడ చిత్రసీమలో పేరున్న సినీ నిర్మాత. ఆయన ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. అతడి మృతదేహాన్ని రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహాలక్ష్మి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సౌందర్య జగదీశ్ ది సహజ మరణమేనా.. ఆత్మహత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం సౌందర్య జగదీష్ మృతదేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచారు. కన్నడ నటుడు దర్శన్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
"సౌందర్య జగదీష్ సార్ ఆకస్మిక మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. కన్నడ చిత్ర పరిశ్రమలో అతని ఉనికి చాలా మిస్ అవుతుంది. అతని కుటుంబ సభ్యులకు, ప్రియమైనవారికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను" అని కన్నడ నిర్మాత, దర్శకుడు తరుణ్ సుధీర్ చెప్పారు
సౌందర్య జగదీష్ కు చెందిన జెట్ లాగ్ పబ్ పై ఇటీవల పోలీస్ కేసు నమోదైంది. టైం దాటి పబ్ ను నిర్వహిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దర్శన్, ధనంజయ్, రాక్‌లైన్ వెంకటేష్ లాంటి సినీ సెలబ్రిటీలు ఆ వివాదాస్పద నైట్ పబ్ పార్టీకి అటెండయ్యారు. పోలీసు దర్యాప్తులో వీరందరికీ ఊరట లభించింది. ఐతే.. ఇప్పుడు సడెన్ గా ఆయన చనిపోవడం హాట్ టాపిక్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com