Tillu Cube : టిల్లూ క్యూబ్‌లో పూజా హెగ్డే.. సిద్ధుకు జోడీగా!

Tillu Cube : టిల్లూ క్యూబ్‌లో పూజా హెగ్డే..  సిద్ధుకు జోడీగా!
X

తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిపోయింది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలో పెద్దగా హిట్ సినిమాలు చేయకపోయినా.. తనకు స్టార్ల సరసన అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. కానీ ఇటీవల టాలీవుడ్‌లోనే ఐరెన్ లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజా. దీంతో తనకు ఇక టాలీవుడ్‌లో అవకాశాలు రావు అనుకున్నారంతా. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో పూజాకు ఛాన్స్ వచ్చినట్లుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించనున్న ‘టిల్లూ క్యూబ్‌’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బుట్టబొమ్మను మేకర్స్ సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీ సిద్ధు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకుపైగా కలెక్షన్లు (గ్రాస్) రాబట్టింది.

మరోవైపు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో పూజా హెగ్డే ఓ ఐటెమ్ సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.కాగా పూజా రంగస్థలం సినిమాలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేశారు

Tags

Next Story