Pooja Hegde : పాపం బుట్టబొమ్మ.. ఆఫర్లయితే రావట్లేదట

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజాహెగ్దే ( Pooja Hegde ) చేతిలో సినిమాల్లేక కష్టాల్లో పడిపోయిందట. స్టార్ హీరోలే కాదు.. దర్శకులు కూడా ఆమెను ఎంపిక చేసుకోవడం లేదట. మొన్నటిదాకా ఆహా ఓహో అన్న వాళ్లు కాస్త ఇప్పుడు ఆప్షన్స్ వెతికే పనిలో పడిపోయారు. టాలీవుడ్ నుంచి కచ్చితంగా ఆఫర్స్ వస్తాయని ఇన్నాళ్లు ఎదురుచూసిన పూజా.. ఇక్కడ ఆఫర్లు కష్టమే అన్న మైండ్ సెట్ కి వచ్చింది. రాధే శ్యాం తర్వాత పూజా టాలీవుడ్ ఫేట్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన పూజను చూసి ఆమెను అందుకోవడం కష్టమేనని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి సరైన ఛాన్సులు రాకుండా పోయాయి. మహేష్ గుంటూరు కారం సినిమాలో అమ్మడు చేయాల్సి ఉన్నా సినిమాకు ఇచ్చిన డేట్స్ లో పూర్తి చేయలేకపోయారు. ఇంకా ఎక్కువ డేట్స్ అడిగితే వేరే సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత పూజా పేరు కూడా టాలీవుడ్ లో వినిపించలేదు. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అని అనుకుంటే ఆ సినిమానే పక్కన పెట్టేశారు. నాగ చైతన్య, కార్తీక్ దండు కాంబో సినిమాలో పూజా పేరు వినిపిస్తుంది. ఒకవేళ ఆ ఛాన్స్ కూడా మిస్ అయితే మాత్రం అమ్మడిని తెలుగు ఆడియన్స్ మర్చిపోయే చాన్స్ ఉందంటున్నారు సినీ పండితులు. మొన్నటిదాకా తన థై షోతో యూత్ ఆడియన్స్ ని అలరించిన పూజా ఇప్పుడు ఎంతో రెచ్చిపోదామనుకుంటున్నా ఆఫర్లయితే రావట్లేదు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com