Pooja Hegde : రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై పూజా హెగ్డే
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో పూజా హెగ్డే ఓ ఐటెమ్ సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.కాగా పూజా రంగస్థలం సినిమాలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేశారు. ఈ పాటతో పూజా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మొత్తానికి రెండేళ్ల తర్వాత మళ్లీ పూజను మనం తెరపై చూడబోతున్నామన్న మాట. ఈ భామ చివరగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీలో కనిపించింది.
పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తేంటే చాలా కాలం తర్వాత ఈ మూవీతో మరోసారి తారక్ మాస్ నటవిశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైన హిట్టు కొట్టాలనే కసిపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు కొరటాల శివ.
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com