Trivikram : త్రివిక్రమ్ టార్గెట్‌గా పూనమ్ కౌర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్

Trivikram : త్రివిక్రమ్ టార్గెట్‌గా పూనమ్ కౌర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్

డైరెక్టర్ త్రివిక్రమ్ ని (Trivikram) చాన్స్ దొరికితే టార్గెట్ చేస్తుంటుంది అందాల భామ పూనమ్ కౌర్ (Poonam Kaur). అంతకుముందు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసే పూనం కౌర్ ఈమధ్యనే వేస్ట్ ఫెలో అంటూ డైరెక్ట్ గా త్రివిక్రం పేరుని మెన్షన్ చేసింది. మళ్లీ లేటెస్ట్ గా ఇండస్ట్రీలో గురు అంటే అది దాసరి నారాయణ రావు గారే అని వేరే ఎవ్వరు కాదని అంటూ లేటెస్ట్ కామెంట్ చేసింది.

నేను ఇంతకుముందే చెప్పాను మళ్లీ చెబుతున్నా సినీ పరిశ్రమలో గురువు అనే మాటకి నిలువెత్తు నిదర్శనం దాసరి నారాయణ రావు గారు మాత్రమే. ప్రతిభ గల వారిని ఆయన ఎంకరేజ్ చేశారు. ఇతరుల స్క్రిప్ట్ ను హైజాక్ చేసినట్టు ఈ పేరుని హైజాక్ చేయలేరు అని పూనం లేటెస్ట్ గా గురూజీ త్రివిక్రమ్ మీద సెటైర్ వేసింది. ఇది వైరల్ అవుతోంది.

త్రివిక్రమ్ పై పూనమ్ కు ఎందుకు ఇంత మంట అనేదానిపై క్లారిటీ లేదు. అవకాశాలు ఇచ్చి వద్దన్నాడా.. లేక మరేదైనా ఉందా అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story