Prabhas : ప్రభాస్ బర్త్ డే .. కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్

Prabhas : ప్రభాస్ బర్త్ డే .. కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్
X

రెబల్ స్టార్ ప్రభాస్ కు శుభాకాంక్షల వెల్లువ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, ఫ్యాన్స్ ఫొటోలు షేర్ చేసుకుంటే ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణం రాజు నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న గ్లోబల్ స్టార్ కు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పాడు. ప్రభాస్ మిర్చి సినిమాలోని పాపులర్ డైలాగ్ను గుర్తు చేస్తూ.. ‘ఆ కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్.. అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తం' అంటూనే పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్. ప్రేమానురా గాలతో, సుఖసంతోషాలతో రాబోయే సంవత్సరం గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండటంతోపాటు ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, ప్రశాంత్ నీల్ సలార్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న చిరంజీవి 'విశ్వంభర' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Tags

Next Story