Malavika Mohanan : ప్రభాస్ మామూలోడు కాదు......మాళవిక మోహనన్

'పట్టం పోల్ ' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన 'పేట'తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గతేడాది రిలీజ్ అయ్యిన ‘తంగలాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈఅమ్మడు ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీతోపాటు యుధ్ర, హృదయ పూర్వం, సర్దార్ 2 వంటి మూవీల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ మూడు ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ భామ ఒకవైపు షూటింగ్స్ పాల్గొంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటుంది. ఆస్క్ మాళవిక అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఈక్రమంలో రీసెంట్ గా తన ట్విట్టర్ ఫాలోవర్లతో ముచ్చటించింది మాళవిక. 'ప్రభాస్ ని కలవక ముందు ఆయన చాలా సైలెంట్, రిజర్వ్ గా ఉంటారని అనుకున్నాను. ఆయన ఇంటర్వ్యూలు, స్టేజ్ మీద ఉండే తీరు, బయట కనిపించిన విధానంతోనూ చాలా ఇంట్రోవర్ట్ అనుకున్నాను.. కానీ ఆయన చాలా సరదా మనిషి.. అద్భుతమైన మాటకారి. ఎన్నో ముచ్చట్లు చెబుతుంటారు. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. చాలా కూల్గా ఉంటాడు.. ఫన్ చేస్తుంటాడు.. హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మంచి పర్సన్.. ఆయన చుట్టూ మూమెంట్ కూడా ఉండదు. సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత నా ఆలోచన తప్పని అర్థమైంది' అంటూ అని మాళవిక చెప్పుకొచ్చింది. ఇక మారుతి తెరకెక్కిస్తోన్న 'ది రాజాసాబ్' సినిమాలో ప్రభాస్ సరసన మాళవికతో పాటు నిధి, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com