Rajasaab Movie : జులై 18న ప్రభాస్ రాజాసాబ్?

రెబల్ స్టార్ ప్రభాస్, మాళవిక మోహనన్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దు కుంటున్న రొమాంటిక్, హరర్, కామెడీ సినిమా రాజాసాబా. హరర్ జానర్లో ప్రభాస్ మొదటి సారి నటిస్తున్నాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదాతో అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహి స్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జులై 18న విడుదల చేస్తా రని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరోలీక్ బయటికి వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజా సాబ్ చిత్రం నుంచి సీన్ లీకైందంటూ ఓ వీడియో వైరల్గా మారింది. మాళవిక మోహనన్ గాల్లోకి ఎగిరి ఫైట్ చేసినట్టుగా ఆ వీడియోలో ఉంది. రాజా సాబ్ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి ఈ వీడియో లీకైందని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. లీక్డ్ సీన్ అంటూ ఇది వైరల్ అవుతోంది. మరి ఇది నిజంగా రాజా సాబ్ చిత్రానికి సంబంధించినదా.. వేరేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. చేతులకు రోప్స్ కట్టిన ఉన్న హీరోయిన్ను కర్రతో కొ ట్టేందుకు ఓ వ్యక్తి రాగా.. ఆమె గాల్లోకి ఎగురుతుంది. ఇదే "కమంలో మరో రౌడీని కాలితో కొట్టింది. ఇలా ఉన్న ఈ వీడియోనే సోషల్ మీడియాలో రాజా సాబ్ సీన్ అంటూ వైరల్ అవుతోంది. దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com